ఆడియన్స్ కి ప్రభాస్ ‘ప్రాజక్ట్ – కె’ టీమ్ స్పెషల్ హోలీ విషెస్

Published on Mar 9, 2023 1:19 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తాజగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ప్రాజక్ట్ కె. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్విని దత్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కబాలి, దసరా మూవీస్ ఫేమ్ సంతోష్ నారాయణన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, నేడు హోలీ పండుగ సందర్భంగా ప్రాజక్ట్ కె టీమ్ మొత్తం కూడా ఆనందంగా సంబరాలు జరుపుకుని ఆడియన్స్ కి ప్రత్యేకంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక పిక్ ని రిలీజ్ చేసారు. అటు ప్రభాస్ తో పాటు దేశ్యవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో కూడా ప్రాజక్ట్ కె మూవీ పై ఎన్నో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024, జనవరి 12న ఎన్నో భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :