కృష్ణుడుకి సప్పోర్ట్ గా ఏకంగా ప్రభాస్ దిగాడే..!

Published on Aug 7, 2020 2:29 pm IST

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణుడు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు మరియు అమాయకుడు అనే సినిమాలలో హీరోగా కూడా చేశారు. కాగా ఈ నటుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన కూతరు నిత్యా పేరుపై నిత్యా క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. మొదటి చిత్రంగా కొత్తవారితో మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ పేరుతో ఓ యూత్ రొమాంటిక్ డ్రామా నిర్మించారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు లోతుగుడ్డ జయరామ్ తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ మూవీ ప్రమోషన్ కోసం కృష్ణుడు ఏకంగా యంగ్ రెబెల్ స్టార్ ని దించాడు. ప్రభాస్ ఓ వీడియో సందేశం ద్వారా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడాలని కోరారు. ప్రభాస్ ప్రచారంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చి చేరింది. ఇక ఓ టి టి లో త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని మంచి ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More