కోవిడ్ సాయంలో ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ టీమ్ !

Published on May 10, 2021 2:00 pm IST

ప్రస్తుతం సమాజంలో కొవిడ్ తన సెకండ్ వేవ్‌ తో నరకం చూపిస్తోంది. ప్ర‌జ‌లకు ఇప్పటికీ స‌రైన వైద్య అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సాయం అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో పేదలకు సాయం చేయ‌డానికి కొందరు సెల‌బ్రిటీలు ముందుకు వస్తూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయాన్ని ప్రకటిస్తూ పేదలను అందుకుంటున్నారు.

కాగా ఈ క్రమంలో ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ నిర్మాత‌లు కూడా కోవిడ్ బాధితులకు త‌మ వంతుగా సాయం అందించడానికి సన్నాహాలు చేసుకున్నారు. రాధే శ్యామ్ సినిమాలో ఒక సీన్ కోసం హాస్పిటల్ సెట్ ను వేసారు. అయితే ఆ సెట్ ప్రాపర్టీస్ ను బెడ్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌, స్ట్రెచ‌ర్స్‌, మెడిక‌ల్ ఎక్యూప్‌మెంట్‌ లు ఇలా దాదాపు 50 సెట్ ప్రాపర్టీలను 9 పెద్ద ట్ర‌క్స్ ద్వారా నిర్మాతలు హాస్పిట‌ల్‌కు చేర్చి, కరోనా బాధితులకు సాయాన్ని అందించారు.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ పాన్ ఇండియా సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :