ప్రభాస్ మ్యానియా మామూలుగా లేదుగా.!

Published on Aug 6, 2020 11:55 am IST

పాన్ ఇండియన్ హీరోగా పరిచయం అయ్యిన తర్వాత మన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్డమే వేరే లెవెల్ కు వెళ్ళిపోయింది అని చెప్పాలి. మన తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన హీరోగా యంగ్ రెబల్ స్టార్ ఇక వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్ళిపోతున్నారు. కేవలం బాక్సాఫీస్ పరంగా మాత్రమే కాకుండా ఫాలోయింగ్ లో కూడా రెబల్ కు తిరుగులేదని చెప్పాలి.

సోషల్ మీడియాలో కూడా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న డార్లింగ్ ఇటీవలే పేస్ బుక్ లో రికార్డు స్థాయి ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. అయితే ప్రభాస్ మ్యానియా ఒక్క పేస్ బుక్ లోనే కాకుండా మరో బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా గట్టిగా ఉంది.

ఫస్ట్ ఎవర్ మరియు ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ కలిగిన పోస్ట్ నుంచి ఇప్పుడు ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన హీరోగా ప్రభాస్ ఇప్పుడు నిలిచారు. గత ఏడాది ఏప్రిల్ లో ఇన్స్టాలోకి అడుగు పెట్టిన ప్రభాస్ ఈ ఏడాదిన్నర లోపే 50 లక్షల మంది ఫాలోవర్స్ ను రాబట్టేసుకున్నారు. మొత్తానికి మాత్రం డార్లింగ్ మ్యానియా మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More