బెంచ్ మార్క్ సినిమాగా ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.?

Published on Jul 2, 2021 1:00 pm IST

పాన్ ఇండియన్ లెవెల్ నుంచి పాన్ వరల్డ్ సినిమా లోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. “రాధే శ్యామ్” నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” వరకు పాన్ ఇండియన్ సినిమాలు ప్రభాస్ ఒప్పుకోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన భారీ సైంటిఫిక్ ఫాంటసీ చిత్రం పాన్ వరల్డ్ హంగులతో తెరకెక్కనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై మారో బజ్ బయటకి వచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రం బహుశా ప్రభాస్ బెంచ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందట. అంటే ఈ చిత్రాన్ని ప్రభాస్ 25వ సినిమాగా విడుదల కానున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అంటే ఏఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమాని ప్రభాస్ కంప్లీట్ చేస్తాడని ఇంకో టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :