ప్రభాస్ “సలార్” ను ఇలా తెరకెక్కిస్తారా.?

Published on Jan 23, 2021 9:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రాన్ని కూడా ప్రభాస్ లేటెస్ట్ గానే స్టార్ట్ చేసేసాడు. అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించి క్యాస్టింగ్ పరంగా ఇంకా సస్పెన్స్ నడుస్తున్నా అసలు ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నారు అన్న దానికి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ఈ సినిమాను అనౌన్స్ చేసిన మొదట్లోనే ఏ భాషలో తెరకెక్కిస్తారో అన్నది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి దీనిపైనే టాక్ వినిపిస్తుంది సాహో నుంచి తెలుగు మార్టీ హిందీ భాషల్లో ఏకకాలంలో నటించిన ప్రభాస్ ఈసారి తెలుగు మరియు కన్నడ భాషల్లో నటించనున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ పాన్ ఇండియన్ సినిమాను ప్రశాంత్ నీల్ తెలుగు మరియు కన్నడ భాషల్లో ఒకేసారి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ అధికారిక సమాచారం వచ్చే వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :