ప్రభాస్ బిగ్ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ లెవెల్లోనే..!

Published on Apr 24, 2021 4:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా అయినా చేస్తే తన వల్ల అది పాన్ ఇండియన్ లెవెల్ సినిమాగా మారుతుంది. అయితే మరి అలా ఇప్పుడు పలు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లు ప్రభాస్ చేస్తున్నాడు. ఈ లిస్ట్ లో “రాధే శ్యామ్”, “సలార్” అలాగే “ఆదిపురుష్” చిత్రాలు పాన్ ఇండియన్ లెవెల్లోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

అలాగే వీటితో పాటుగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అన్నిటికీ మించి భారీ అంచనాలు సెట్ చేసుకుంది మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన చిత్రమే.. భారీ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల అవుతుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది.

మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం అది జస్ట్ టాక్ మాత్రమే కాకుండా నిజంగానే పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతుండడమే కాకుండా ఆ స్థాయిలోనే విడుదల అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్త్రం ప్రభాస్ నుంచి ఫస్ట్ ఎవర్ పాన్ వరల్డ్ సినిమా రావడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :