త్వరలో తమిళ సినిమా చేస్తానన్న ప్రభాస్ !
Published on Apr 9, 2017 3:29 pm IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంతటి ఉత్సుకత ఉందో కోలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అంటే ఉంది. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. అందుకే చిత్ర టీమ్ తమిళ పాటల ఆడియో వేడుకను కూడా నిర్వహించాలని నిర్ణయించుకుని ఈరోజు చెన్నై చేరుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ వేడుకలో ప్రభాస్ తో పాటు రాజమౌళి, అనుష్క, తమన్నాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన తమిళ అభిమానులకు పెద్ద మాటే ఇచ్చారు.

తాను పుట్టింది చెన్నైలోనేనని, కనుక తన తమిళ ఫ్యాన్స్ కోసం తప్పకుండా సినిమా చేస్తానని బలంగా చెప్పారు. ఈ రోజు సాయంత్రం తమిళ పాటల విడుదల వేడుక ఘనంగా జరగనుంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరక్షన్లో చేస్తున్న చిత్రం తమిళంలో కూడా రిలీజ్ కానుంది.

 
Like us on Facebook