జస్ట్ మోషన్ పోస్టర్ తోనే యూనిక్ ఫీట్ సెట్ చేసిన ప్రభాస్!

Published on May 5, 2021 8:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ అద్భుతమైన వింటేజ్ వండర్ ఫుల్ లవ్ స్టోరీ పై మరికొన్ని ఆసక్తికర విషయాలే బయటకి వస్తున్నాయి. కానీ మరోపక్క ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ మాత్రం మంచి యూనిక్ రికార్డ్స్ సెట్ చేస్తుంది.

రీసెంట్ గానే ఇండియా లోనే ఏ పాన్ ఇండియన్ సినిమా గ్లింప్స్ కి హాఫ్ మిలియన్ లైక్స్ రికార్డు టచ్ కాగా లేటెస్ట్ గా ఈ సినిమా జస్ట్ మోషన్ పోస్టర్ టీజర్ కే 20 మిలియన్ వ్యూస్ తో ఇండియా లోనే మరో యూనిక్ ఫీట్ ను ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన RRR మోషన్ పోస్టర్ వీడియో కి కూడా రాలేదు. దీనిని ప్రభాస్ రీచ్ పాన్ ఇండియన్ లెవెల్లో ఏ విధంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :