స్పిరిట్: నీడతో కూడా ఎలివేషన్.. చిన్న ఫోటోతో సోషల్ మీడియా షేక్ చేసిన రెబల్ స్టార్

స్పిరిట్: నీడతో కూడా ఎలివేషన్.. చిన్న ఫోటోతో సోషల్ మీడియా షేక్ చేసిన రెబల్ స్టార్

Published on Jun 20, 2026 8:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో చేస్తున్న భారీ వైలెంట్ యాక్షన్ చిత్రమే ‘స్పిరిట్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా సింగ్ గీతం ప్రమోషన్స్ లో ప్రభాస్ స్లిమ్ లుక్ చూసి స్పిరిట్ ని సందీప్ నెక్స్ట్ లెవెల్లో షేప్ ఔట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు.

ఇక లేటెస్ట్ గా ఓ సడెన్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రభాస్ నీడను చూపించి మరీ ఇందులో ఎలివేట్ చేయడం వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ ల నీడలు ఇందులో కనిపిస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ ఈ ఆకస్మిక సర్ప్రైజ్ చూసి ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు