ప్రభాస్ బ్రేక్ లేకుండా … !

Published on Apr 30, 2019 8:50 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ బ్రేక్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల తన 20వ చిత్రం రెండవ షెడ్యూల్ ను పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సాహో ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. ఇక ఈషూటింగ్ ను కంప్లీట్ చేశాక వెంటనే యూరప్ వెళ్లనున్నాడు ప్రభాస్.

మే 10నుండి జరిగే 20వ చిత్రం మూడవ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా గోపి కృష్ణ మూవీస్ నిర్మిస్తుంది.

ఇక సుజిత్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సాహో ఆగస్టు 15న భారీ స్థాయిలో విడుదలకానుండగా ప్రభాస్ 20 వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :