టాక్..”ఆదిపురుష్” బడ్జెట్ పై ప్రభాస్ స్పెషల్ కేర్.!?

Published on May 11, 2021 11:08 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఇతిహాస గాథ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కృతి సనన్ సీతా దేవి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా షూట్ ఇటీవల హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ ఓ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సడెన్ గా షూట్ చేంజ్ చేసిన నేపథ్యంలో ఆదిపురుష్ బడ్జెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని దర్శకుడు ఓంరౌత్ తో ప్రభాస్ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది.

అక్కడ నుంచి ఇక్కడకి క్యాస్ట్ అండ్ క్రూ షిఫ్ట్ అవుతున్నందుకు కొంత మేర బర్డెన్ పడుతుంది అందుకే ప్రభాస్ ఈ చిత్రం బడ్జెట్ విషయంలో ఓంరౌత్ తో కాస్త కేర్ గానే ఉన్నాడట. మరి మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్ మరియు కిషన్ కుమార్ లు 500 కోట్ల మేర బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :