పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్పిరిట్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది.
అయితే, ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చారు. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానుల్లో స్పిరిట్ జోష్ నింపేసింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి తనదైన మార్క్ టేకింగ్‌తో రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ రూత్‌లెస్ కాప్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


