అక్కడ ‘ది రాజా సాబ్’కు భారీ నిరాశ.. ప్రభాస్ కెరీర్‌లోనే వీక్..!

అక్కడ ‘ది రాజా సాబ్’కు భారీ నిరాశ.. ప్రభాస్ కెరీర్‌లోనే వీక్..!

Published on Jan 14, 2026 1:00 AM IST

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ సినిమా ‘ది రాజా సాబ్’(The Raja Saab) హిందీ బెల్ట్‌లో మొదటి నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ రిలీజ్ అయినప్పటికీ, మొదటి రోజు కేవలం రూ.6 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. హిందీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

వీకెండ్‌లో కూడా పెద్దగా గ్రోత్ లేకపోవడంతో, మొదటి సోమవారమే సినిమా నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కూలిపోయింది. ఆ రోజు రూ.2 కోట్ల నెట్ కూడా రాబట్టలేక పోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు హిందీలో ఈ సినిమా సుమారు రూ.17 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే వీక్ కలెక్షన్స్‌గా నిలిచాయి.

నిజానికి ఈ కలెక్షన్స్‌నే ఓపెనింగ్ డే నంబర్‌గా ఉండాల్సింది కానీ.. సినిమాకు సరైన బజ్ లేకపోవడం మైనస్‌గా మారింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు