తక్కువ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీ కావాలంటున్న ప్రభాస్

Published on Oct 17, 2019 9:18 am IST

సాహో మూవీ ఫలితం ప్రభాస్ కొత్త ఆలోచనలకు కారణమైంది. ఆయన తాజా చిత్రం జాన్ మూవీ బడ్జెట్ విషయంలో ఆయన ఒక స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాన్ మూవీ పరిమిత బడ్జెట్ లో తెరకెక్కించాలని నిర్మాతలకు సూచించారట. సాహో దేశవ్యాప్తంగా 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. 424కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి కూడా అపజయాన్ని మూటగట్టుకుంది. చిత్ర విజయాన్ని లాభాలతో లెక్కేసే ఈరోజుల్లో వందల కోట్ల వసూళ్లు సాధించిన సాహో ఫ్లాప్ మూవీగా పేరుతెచ్చుకుంది.

అలా కాకుండా సాహో థియరిటికల్ రైట్స్ 200 నుండి 250 కోట్లకు అమ్మినట్లయితే కనీసం ఖర్చులు పోనూ 50కోట్ల వరకు సాహో లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచేది. సాహో బడ్జెట్ 350కోట్లు కావడంతో ఎక్కువ ధరలకు హక్కులు అమ్మడం వలన డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. ఈ సూత్రం మైండ్ లో పెట్టుకున్న ప్రభాస్ తక్కువ బడ్జెట్ లో పాన్ ఇండియా రేంజ్ కి తగ్గకుండా జాన్ మూవీ తెరకెక్కించాలని చెప్పారట. హిందీలో మార్కెట్ ఏర్పరుచుకున్న ప్రభాస్ నటించే చిత్రాలన్నీ హిందీలో కూడా విడుదల అవుతాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా, పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More