వైరల్ అవుతున్న స్టైలిష్ ప్రభాస్ లుక్.!

Published on Oct 22, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభ బర్త్ డే వైబ్స్ ఆల్రెడీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పైగా తన బిగ్గెస్ట్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం కూడా డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. వీటిలో మాత్రం పెద్ద అప్డేట్ తాను నటించి కంప్లీట్ చేసేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” నుంచి వస్తున్న టీజర్ కోసం అనే చెప్పాలి. ఈ సినిమలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్యగా చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర పోషించాడు.

అంతే కాకుండా ఒక లవర్ బాయ్ గా కూడా కనిపించనుండగా ఇందులో ఒక స్టైలిష్ లుక్ బయటకి వచ్చి ఇప్పుడు వైరల్ అవుతుంది. స్కై బ్లూ సూట్ లో చాలా స్టైలిష్ లుక్ ప్రభాస్ కనిపిస్తూ ఈ సినిమాలో తన లుక్స్ తో ఎలాంటి ట్రీట్ ఇస్తాడో అనే దానికి చిన్న శాంపిల్ లా ఉన్నాడు. మొత్తానికి మాత్రం టీజర్ కి ముందుగా వచ్చిన ఈ పోస్టర్ మరింత ఎగ్జైట్మెంట్ ని పెంచుతుంది. ఇక రేపు వచ్చే టీజర్ లో ప్రభాస్ నుంచి ఇంకెన్ని వెర్షన్స్ చూస్తామో చూడాలి.

సంబంధిత సమాచారం :