మరోసారి సుజీత్‌తో సినిమాకి రెడీ అయిన ప్రభాస్..!

Published on Aug 29, 2021 12:05 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సుజిత్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ “సాహో” సినిమా చేయగా అది కాస్త ప్లాప్ అయ్యింది. అయితే దీని గురుంచి పెద్దగా పట్టించుకోని ప్రభాస్ మళ్లీ అతడితో సినిమాని చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ సారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ని చూపించేందుకు సుజీత్ ప్లాన్ చేసుకున్నాడని, ఈ సినిమా లైన్‌ని ప్రభాస్‌కి వినిపించగా అది ఆయనకు నచ్చిందట.

దీంతో ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :