ఖైరతాబాద్ కి పోటెత్తిన ప్రభాస్ ఫ్యాన్స్, కారణం?

Published on Aug 7, 2020 8:21 am IST

నిన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి ప్రభాస్ ఫ్యాన్స్ పోటెత్తారు. అక్కడ సడన్ గా ప్రత్యక్షమైన ప్రభాస్ ని చూడడానికి పోటీపడ్డారు. విషయంలోకి వెళితే ప్రభాస్ ఓ కొత్త కారు కొన్నారు. దాని రిజిస్ట్రేషన్ కొరకు ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక ఆర్టీఏ ఆఫీసు సిబ్బంది మరియు ఫ్యాన్స్ ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఫొటోలు దిగేందుకు అక్క‌డి జ‌నం ఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో వారితో ప్రభాస్ ఫొటోల‌కు పోజిచ్చారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్నారు. పీరియాడిక్ లవ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే తన 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్నారు. హీరోయిన్ గా దీపికా ప‌దుకొనే నటిస్తుండగా, ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More