ఈవిషయంలో టాలీవుడ్ నుండి ప్రభాసే టాప్..!

Published on Aug 8, 2020 3:30 pm IST

ప్రభాస్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏకంగా సినిమాకు 70కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ దాదాపు తన స్నేహితులతోనే సినిమాలు చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ మిత్రుల బ్యానర్ అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రతి చిత్రం 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాధే శ్యామ్ బడ్జెట్ కూడా 200 కోట్లకు పై మాటే. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న మూవీ బడ్జెట్ 500 కోట్లుగా తెలుస్తుంది.

ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ 70 కోట్లకు పైమాటేనట. టాలీవుడ్ లో మరో స్టార్ హీరో ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. మిగతా స్టార్ హీరోలు 50 కోట్లు కూడా తీసుకోవడం లేదు. దీనితో ప్రభాస్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన నేపథ్యంలో ఆయన రేంజ్ వేరుగా ఉంది.

సంబంధిత సమాచారం :

More