మరొక షెడ్యూల్ ముగించిన ప్రభాస్ టీమ్

Published on Mar 17, 2020 4:26 pm IST

ప్రభాస్ కొత్త చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ 2020లో ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగించిన టీమ్ కొన్ని రోజులుగా జార్జియాలో షూట్ చేస్తున్నారు. కరోన వైరస్ అందోళన ఉన్నా కూడా చిత్రీకరణ కొనసాగించి ప్లాన్ ప్రకారమే ఆ షెడ్యూల్ ముగించారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే, ప్రియదర్శిలతో పాటు ఇంకొందరు ముఖ్య తారాగణం పాల్గొన్నారు. షూట్ ముగియడంతో టీమ్ మొత్తం ఇండియా బయలుదేరారు. ఈ సందర్బంగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాకుండా మంచి రొమాంటిక్ కంటెంట్ కూడా ఉండనుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More