పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే రిద్ధి కుమార్ ఇంకా మాళవిక మోహనన్ లతో దర్శకుడు మారుతీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ ఫాంటసీ చిత్రమే ది రాజా సాబ్ (Raja Saab). మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఎట్టకేలకి సినిమా రిలీజ్ కి వచ్చింది.
కానీ నైజాం మార్కెట్ లో మాత్రం ఈ సినిమా ఊహించని విధంగా లేట్ అయింది. ఇలా కొంచెం ప్లానింగ్ అయితే బెడిసి కొట్టడంతో ప్రీమియర్స్ ఇంపాక్ట్ అయితే సినిమా ఓపెనింగ్స్ పై పడింది. ఇక ఇలానే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ మంచి ఓపెనింగ్స్ నే సాధించే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది.
వరల్డ్ వైడ్ ప్రీ సేల్స్ ఇంకా ప్రీమియర్స్ బుకింగ్స్ తో మొదటిరోజు ఈ సినిమాకి 100 కోట్ల లోపే ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. నైజాంలో సినిమాకి అనుకున్న విధంగా అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మాత్రం అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ సాధించి ఉండేది అని ట్రేడ్ వర్గాల్లో టాక్. సో దీనిపై అఫీషియల్ నెంబర్ ఎంత వస్తుందో చూడాలి.


