రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రమే “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని దర్శకుడు చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లోనే సినిమా తాలూకా ఫైనల్ రన్ టైం కోసం రివీల్ చేశారు.
The Raja Saab final Runtime – 3 గంటల్లోపే కొత్త రన్ టైం..
రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన రాజా సాబ్ ని మేకర్స్ మొదటిగా 3 గంటల 10 నిమిషాలకి అలా కట్ చేసినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా సినిమాని 2 గంటల 50 లేదా 55 నిమిషాలకి కట్ చేస్తున్నట్టు ఖరారు చేశారు. సో 3 గంటల్లోపే ఈ సినిమా రానుంది అని చెప్పవచ్చు.
ఒరిజినల్ 4 గంటలు పైనే..
ఈ సినిమాకి రా ఫుటేజ్ ఏకంగా 4 గంటల పైనే వచ్చినట్టు కూడా మారుతీ తెలిపారు. అందులో ఓ గంట తన దగ్గర ఉంచుకున్నట్టు కూడా తెలిపారు. కానీ దీనిని కూడా కట్ చేసి ఫైనల్ వెర్షన్ కి మరో కట్ ని వదలనున్నారు.
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు.


