అఫీషియల్: రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ కోసం ‘డాన్’ దర్శకుడే!

అఫీషియల్: రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ కోసం ‘డాన్’ దర్శకుడే!

Published on Jan 3, 2026 11:23 AM IST

Thalaivar 173

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు జైలర్ 2 అనే అవైటెడ్ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ మరో టాప్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా కొన్నాళ్ల కితం భారీ సినిమా దర్శకుడు సుందర్ సి తో అనౌన్స్ చేసారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి సుందర్ తప్పుకొని ట్విస్ట్ ఇచ్చారు. దీనితో మళ్ళీ కొత్త దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు ఫైనల్ గా దీనిపై అధికారిక క్లారిటీ వచ్చేసింది.

రజినీకాంత్, కమల్ హాసన్ ల భారీ ప్రాజెక్ట్ ని శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకుడు సిబి చక్రవర్తి తెరకెక్కిస్తున్నట్టు సాలిడ్ అనౌన్సమెంట్ అందించారు. అంతే కాకుండా సినిమా రిలీజ్ ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే అని కూడా ప్రకటించడం విశేషం. సో ఈ క్రేజీ కాంబినేషన్ కొంచెం గ్యాప్ తీసుకున్నా ఆన్ టైం వస్తుంది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తుండడం విశేషం.

తాజా వార్తలు