మన శంకర వరప్రసాద్ గారు.. ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్ చేశారు..!

మన శంకర వరప్రసాద్ గారు.. ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్ చేశారు..!

Published on Jan 3, 2026 4:02 PM IST

MSG

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. సక్సెస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. అయితే, ఈ ట్రైలర్ రన్ టైమ్‌పై చిత్ర యూనిట్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 30 సెకన్లు ఉండనుందని.. ఎడిట్ రూమ్ నుంచి అనిల్ రావిపూడి ఓ ఫొటోను షేర్ చేసి అభిమానుల్లో ఆసక్తి నింపారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, కేథరీన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు