“స్పిరిట్” లో ప్రభాస్ తో ఫుల్ ఫ్లెడ్జ్ గా..?

Published on Oct 9, 2021 1:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి తన స్టార్డం ని విస్తరించే పనిలో ఉన్నాడు. ఇప్పుడు వరకు హాలీవుడ్ నుంచి ఎందరో హీరోలు ప్రపంచ వ్యాప్త బాక్సాఫీస్ కి పరిచయం అయ్యారు అలానే ఇప్పుడు ప్రభాస్ ఖ్యాతి విస్తరించబోతుంది. అది కూడా నిన్న సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో అనౌన్స్ చేసిన భారీ సినిమా “స్పిరిట్” తో కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఏకంగా 8 భాషల్లో ఈ సినిమాని అనౌన్స్ చెయ్యడంతో తారా స్థాయి అంచనాలు దీనిపై నెలకొన్నాయి. మరి ఈ సినిమాలో ప్రభాస్ చేసే రోల్ ఎప్పుడు నుంచో ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్న పోలీస్ రోల్ లా ఉంటుందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తుండగా ఒకవేళ నిజం అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రభాస్ ని పోలీస్ రోల్ లో అందులోని ఒక యూనివర్సల్ కాప్ గా చూడడం గ్యారంటీ అని చెప్పాలి. లాస్ట్ టైం సాహో లో కనిపించాడు కానీ తన రోల్ కంప్లీట్ గా అది కాదు అందుకే ఈసారి అందరి చూపులు స్పిరిట్ పై పడ్డాయి.

సంబంధిత సమాచారం :