అభిమానుల్ని కలవబోతున్న ప్రభాస్ !


ప్రభాస్ తన అభిమానుల్ని కలవబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఏప్రిల్ 3 నుండి మరో నాలుగు రోజుల వరుకు ప్రభాస్ తన ఫాన్స్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. గత రెండు రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ రేపటితో కంప్లీట్ అవ్వొచ్చని సమాచారం.

సాహో సినిమాపై అభిమానులకు భారి అంచనాలు ఉన్నాయి. భారి బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ సినిమా నుండి మరో టిజర్ త్వరలో రానుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం.ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన లూక్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక లుక్ పోలీస్ ఆఫీసర్ గా దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది.