వైఎస్సార్ బయోపిక్ కు తన సహకారం అందించనున్న ప్రభాస్ !
Published on Jun 29, 2018 8:36 am IST


వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ పేరుతో బయోపిక్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డిగారి పాత్రను పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లాకు రెబల్ స్టార్ ప్రభాస్ మంచి సన్నిహితుడు. అందుకే ప్రభాస్ సినిమా విడుదలయ్యే సమయానికి ప్రమోషన్లలో పాల్గొని తన వంతు సహకారం అందిస్తానని విజయ్ కు మాటిచ్చారట. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ వరకు జరగనున్న ఒకే షెడ్యూల్లో ముగియనుంది. వైఎస్ 2003లో చేపట్టిన 60 రోజుల పాదయాత్ర, ఆయన పరిపాలన, మడమ తిప్పని వ్యక్తిత్వం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook