గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. కాగా ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుగారి సతీమణి శ్యామలా దేవి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న రెండు సినిమాలు పూర్తీ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె హింట్ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని మాకు కూడా తొందరగానే ఉంది. మేం తనని పెళ్లి గురించి అడిగితే.. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలు అయిపోయాక చూద్దాం అంటాడు. ఏమైనా త్వరలోనే ఆ రెండు చిత్రాలు పూర్తి అవుతాయి. అప్పుడు తప్పకుండా ప్రభాస్ పెళ్లి కబురు చెబుతామని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతోనూ, జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న మరో సినిమాతోనూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు విడుదలై పోయిన తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.


