ప్రభాస్ ‘మే’ ఫస్ట్ వీక్ నుండి.. ?

Published on Apr 28, 2019 9:57 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకుడిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ప్యాచ్ వర్క్ కు సంబంధించి ముంబైలో ప్రస్తుతం షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ప్రభాస్ కూడా మే మొదటి వారం నుండి తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలోని విజువల్స్ నుంచి ప్రభాస్ యాక్షన్ సీన్స్ వరకూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. అలాగే ప్రభాస్ పాత్రకు సంబధించి కూడా వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఇటీవలే సాహో నుండి ఒక ఫోటో లీకయింది. ఆ ఫోటోలో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఫొటోలో బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే.. లొకేషన్స్ కూడా తెలుగు సినిమాకి చాలా కొత్తగా ఉన్నట్లు అనిపించాయి.

ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం :