ప్రభాస్ “రాధే శ్యామ్” స్టార్ట్ చేసేది అప్పుడు నుంచే అట.!

Published on Jun 13, 2021 5:50 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఇపుడు ప్రభ చెయ్యాల్సిన సినిమాల పెండింగ్ లిస్ట్ లో ఉంది. అయితే ఆల్రెడీ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం మళ్ళీ రీ షూట్స్ నిమిత్తం కొన్ని రోజులు ప్లాన్ చెయ్యాల్సి ఉంది. దానిని అప్పుడే పూర్తి చేసేద్దాం అనుకున్నారు కానీ కరోనా ఎఫెక్ట్ మూలాన అది కాస్త ఆపేసారు.

మరి ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్ రాధే శ్యామ్ సెట్స్ లో మళ్ళీ అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఈ జూన్ చివరి వారంలో ప్రభాస్ అండ్ టీం రాధే శ్యామ్ షూట్ ను స్టార్ట్ చేసి ఫినిష్ చేసేయనున్నారట. ఆ తర్వాత మిగతా సినిమాల షూటింగ్స్ లో డార్లింగ్ పాల్గొననున్నాడు. ఇక ఈ భారీ చిత్రాన్ని రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :