ప్రభాస్ ‘జాన్’ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూపులు !

ప్రభాస్ ‘జాన్’ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూపులు !

Published on Nov 24, 2019 9:00 PM IST

Prabhas2

`జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ వేస్తున్నారు. అయినా ఇప్పటికీ షూటింగ్ అప్ డేట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి కొత్త అప్‌ డేట్స్ కావాలని పోస్ట్ చేస్తున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ను ట్యాగ్‌ చేస్తూ We Want Prabhas 20 Update అనే హ్యాష్‌ట్యాగ్‌ తో పోస్ట్ లు పెడుతున్నారు దాంతో ఈ హ్యాష్ టాగ్ బాగా ట్రెండ్‌ అవుతోంది. మరి అభిమానుల కోరిక మేరకైనా చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు