నైజాం ఏరియా లో ప్రభాస్ “కల్కి” డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇవే!

నైజాం ఏరియా లో ప్రభాస్ “కల్కి” డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇవే!

Published on Apr 28, 2024 3:11 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి (Kalki2898AD). జూన్ 27, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో దీపికా పదుకునే, దిశా పటాని లు కథానాయికలు గా నటిస్తుండగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగింది.

నైజాం ఏరియాలో ఈ చిత్రం ను గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్‌ పతాకం పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ప్రచార చిత్రాలతో సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు