“శ్యామ్ సింగ రాయ్” పై ప్రభుదేవా ఇంట్రెస్టింగ్ రివ్యూ.!

Published on Jan 23, 2022 8:00 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. పునర్జన్మ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో సాలిడ్ హిట్ అయ్యి మొన్నటి నుంచే స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.

మరి ఇలా అనుకుంటున్నప్పుడే మరోసారి ఈ సినిమాకి మరింత స్థాయిలో ఫీడ్ బ్యాక్ వస్తుందని భావించాము. ఇప్పుడు అదే నిజం తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మరింత మంది ప్రముఖుల మన్ననలు అందుకుంటుంది.

తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయినటువంటి ప్రభుదేవా ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇచ్చారు. రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా చూడడం జరిగిందని సినిమా నాకు చాలా నచ్చింది అని సినిమా యూనిట్ అంతా గ్రేట్ వర్క్ అందించారని ప్రభుదేవా కొనియాడారు. దీనితో శ్యామ్ విజయ పరంపర ఇతర భాషల్లో కూడా అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :