హీరోగా సగం సక్సెస్ అయ్యాడు..!

హీరోగా సగం సక్సెస్ అయ్యాడు..!

Published on Apr 6, 2020 4:13 PM IST

బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తన కొత్త సినిమాలోని ఓ సాంగ్ లిరికల్ వీడియో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. ప్రదీప్ హీరోగా నటించిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ నుండి ఫిబ్రవరిలో నీలి నీలి ఆకాశం… అనే ఓ లిరికల్ సాంగ్ విడుదలయ్యింది. అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ట్రెమండస్ సక్సెస్ అందుకుంది.

ఈ సాంగ్ కి ఇప్పటి వరకు 100 మిలియన్స్ వ్యూ స్ దక్కడం విశేషం. అంటే ఏకంగా ఈ సాంగ్ ని 10 కోట్ల మంది యూ ట్యూబ్ లో వీక్షించారన్న మాట. ఒక డెబ్యూ హీరో సినిమా సాంగ్ కి ఇన్ని వ్యూస్ రావడం అనేది రికార్డు. స్టార్ హీరోల సాంగ్స్ కి సైతం ఈ ఫీట్ కష్టం కాగా ప్రదీప్ అలవోకగా అందుకున్నాడు. దీనితో ప్రదీప్ హీరోగా సగం సక్సెస్ అయినట్లే అని కొందరు అంటున్నారు. దర్శకుడు మున్నా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు