“అఖండ” సెట్స్ లో బాలయ్య చాలా చిల్ అట.!

Published on May 14, 2021 10:04 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు హీరోయిన్ ప్రగ్యా లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది. అయితే పలు సందర్భాల్లో మంచి యారోగెంట్ గా కనిపించే బాలయ్య అఖండ సెట్స్ లో మాత్రం చాలా చిల్ గా ఉన్నారని ప్రగ్యా తెలిపింది.

తాను బాలయ్యతో ముందు స్క్రీన్ షేర్ చేసుకోకముందు చాలా విన్నానని అందుకే ముందు ఆయనతో నటన అనేసరికి కాస్త భయపడ్డానని కానీ సెట్స్ లో మాత్రం బాలయ్య చాలా అంటే చాలా చిల్ గా కూల్ గా ఎప్పుడూ ఉంటూ జోక్స్ పేలుస్తూ ఉండేవారని ప్రగ్యా చెప్పుకొచ్చింది. అలాగే మళ్ళీ షూట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నా అని కూడా చెప్పింది.

సంబంధిత సమాచారం :