“అఖండ” పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ప్రగ్యా.!

Published on May 14, 2021 7:09 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా “అఖండ” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ఈ సినిమా కోసం చెప్పింది.

ఈ చిత్రంలో తాను ఇప్పటి వరకు చెయ్యని ఒక సాలిడ్ రోల్ చేసానని ప్రతి ఒక్కరికి తన రోల్ నచుతుంది అని చెప్పింది. అంతే కాకుండా ఒక్కోసారి సెట్స్ వందల నుంచి వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగింది అని ఆ వెయ్యి మందిని కూడా బోయపాటి హ్యాండిల్ చెయ్యడం అమేజింగ్ గా అనిపించింది అని ప్రగ్యా చెప్పింది.

అలాగే బోయపాటి మరియు బాలయ్యలతో వర్క్ చాలా ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని చెప్పింది. అంతే కాకుండా సెట్స్ బాలయ్య మంచి ఎనర్జిటిక్ గా మరియు హార్డ్ వర్కింగ్ అని తెలిపింది. అలాగే థియేటర్స్ లో విడుదల కోసం తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ సినిమా స్యూర్ షాట్ హిట్ అవుతుందని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది.

సంబంధిత సమాచారం :