మొయినాబాద్‌ లో బాలయ్యతో ప్రగ్యా !

Published on Apr 19, 2021 2:00 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం బాలయ్య బాబు హీరోగా రాబోతున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. బాలకృష్ణ, హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ తదితరులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కాగా ప్రగ్యా బాలయ్య బాబుతో తన వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి మాట్లాడుతూ ‘‘బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఆయనతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అమేజింగ్‌’’ అని చెప్పుకొచ్చింది. అలాగే కరోనా నేపథ్యంలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో మాస్క్‌ ధరించడంతో పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.

ఇక అఖండ టీజర్ లో బాలయ్య అఘోర పాత్రలో రౌద్రంగా కనిపించి అలరించారు. అన్నట్టు ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ను మించిన హిట్ ఇవ్వాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :