కంగనాతో ఎలాంటి సమస్య లేదు : ప్రకాష్ కోవెలమూడి

Published on Jun 8, 2019 3:59 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు, దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో ‘మెంటల్ హె క్యా’ అనే సినిమా తీస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కానీ ఔట్ పుట్ చూసిన కంగనా సంతృప్తి చెందలేదని, కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని పట్టుబట్టిందని, కానీ ప్రకాష్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని బీటౌన్లో వార్తలు మొదలయ్యాయి.

దీంతో కంగనా గతంలో తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కూడా ‘మణికర్ణిక’ సినిమా విషయంలో పెద్ద వివాదం పెట్టుకుని, ఇప్పుడు ఇంకో తెలుగు దర్శకుడితో గొడవకు దిగిందని టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో బయటికొచ్చిన ప్రకాష్ కోవెలమూడి అసలు విషయం ఏమిటో చెప్పుకొచ్చారు. తనకు కంగనాకు ఎలాంటి గొడవలు లేవన్న ఆయన ఆమెతో కలిసి వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని, రీషూట్స్ ఏమీ జరగడంలేదని, అంతా సజావుగానే ఉందని అన్నారు. ఇక రిలీజ్ డేట్ మార్పు నిర్మాతలు నిర్ణయమని, సినిమా జూలై 26న విడుదలవుతుందని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More