ప్రకాష్ రాజ్ వ్యవహారం పెద్దగా మారుతుందా?

ప్రకాష్ రాజ్ వ్యవహారం పెద్దగా మారుతుందా?

Published on Apr 17, 2026 9:59 PM IST

వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ కి కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. నటుడిగా ఓ పక్క బిజీగా ఉన్నపటికీ ఆఫ్ లైన్ లో తాను కొన్ని విషయాల్లో స్పందించే తీరు మాత్రం అభ్యంతరకరంగా మారుతుంది. ఇలా తాజాగా ప్రకాష్ రాజ్ వ్యవహారం సోషల్ మీడియాలో సహా నేషనల్ వైడ్ గా వైరల్ గా మారుతుంది.

ఇటీవల ఓ మలయాళ ఇంటరాక్షన్ లో ప్రకాష్ రాజ్ రామాయణం కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు అలాగే రావణుని నడుమ ఇలా జరిగింది అంటూ ఓ కథ చెప్పడం పైగా అందులో వ్యంగ్యాన్ని జోడించి హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడ్డం మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

దీనితో ఈ మేటర్ మాత్రం నెమ్మదిగా పెద్దది అయ్యేలా కనిపిస్తుంది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఏమన్నా వివరణ ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే స్పిరిట్, దృశ్యం 3 తదితర భారీ సినిమాల్లో తాను నటిస్తూ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు