ఆ టాప్ నిర్మాతతో ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్.!

Published on Jul 2, 2020 1:52 am IST


మన దేశంలో ఎలాంటి భాషలో అయినా అనర్గళంగా మాట్లాడి అద్భుతమైన నటన కనబర్చే అతి తక్కువ మంది వెర్సిటైల్ నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఇమిడిపోయే ఈ నటుడు ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలా రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర కూడా ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారట.

అందులో భాగంగా ఆ సిరీస్ కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను మెయిన్ లీడ్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా దీనికి సంబంధించి మిగిలిన వివరాలు కొన్ని రోజుల్లోనే వెల్లడిస్తామని వారు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More