డెవిల్ ఈజ్ బ్యాక్.. బెడ్‌పై నుంచి ప్రకాశ్ రాజ్ ట్వీట్..!

Published on Aug 11, 2021 9:21 pm IST

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ప్రకాశ్ రాజ్ పాల్గొనగా ఫ్లోర్‌పై జారిపడ్డారు. దీంతో ఆయన చేతికి చిన్నపాటి ప్రాక్చర్ అయ్యింది. అయితే సర్జరీ కోసం హైదరాబాద్‌కి వస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ నిన్న తెలిపారు.

అయితే తాజాగా తన ఆరోగ్యంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్ డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ.. సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, తనకు సర్జరీ చేసిన మిత్రుడు, డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటానని చెబుతూ, ఆసుపత్రి బెడ్ మీద నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోను ప్రకాశ్ రాజ్ తన అభిమానులతో పంచుకున్నాడు.

సంబంధిత సమాచారం :