ప్రజలకు ప్రకాష్ రాజ్ విన్నపం.

Published on Mar 24, 2020 10:16 am IST

విలక్షణ నటుడు ప్రకాజ్ రాజ్ ప్రజలకు ఓ విన్నపం చేస్తున్నాడు. కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదకరం అనేది ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే అర్థం అవుతుంది. ఊహకు మించిన ప్రమాదం దీని నుండి పొంచి వుంది అని అనిపిస్తుంది. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ట్విటర్ వేదికగా ప్రజలను ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాడు. కరోనా పై యుద్ధంలో బాధ్యత గల పౌరులుగా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది.

ఇక ప్రకాష్ రాజ్ తన వ్యక్తి గత సిబ్బందితో పాటు, తన సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, జీతగాళ్లకు మే వరకు శాలరీస్ చెల్లించి వేశారు. కరోనా కర్ఫ్యూ సమయంలో ఆర్థికంగా వారు ఇబ్బంది పడకూడదని ముందుగానే జీతాలు ఇచ్చేశారు.

సంబంధిత సమాచారం :

More