సినిమా రంగంలో స్టార్ నటులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ప్రకాష్ రాజ్ లు పలు సినిమాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓజి అనే భారీ సినిమాలో కూడా కలిసి నటించారు. అయితే గత కొన్నాళ్ల నుంచి పవన్ తో ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా కొన్ని డిఫరెన్స్ లు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ వకీల్ సాబ్, ఇప్పుడు ఓజి వరకు సినిమాలు కూడా చేసారు.
కానీ ఎప్పుడూ బయట మాత్రం ఇరువురు పరస్పరం గీత దాటి మాట్లాడింది లేదు. నిజానికి పవన్ సైడ్ నుంచి ఎప్పుడూ పెద్దగా స్పందన ఉండేది కాదు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం సోషల్ మీడియాలో పవన్ ని ప్రశ్నిస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తనకి కొత్త పేర్లు పెడితే నేను కూడా పెట్టగలను అంటూ పవన్ కళ్యాణ్ ని ‘వాడు’ అంటూ సంభోదించడం షాకింగ్ గా మారింది.
ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తన తోటి నటుడు పైగా ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలా మాట్లాడ్డం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఈ విషయంలో సీరియస్ అవుతున్నారు. మరి ఇదెక్కడి వరకు వెళుతుందో చూడాలి.


