నాన్ లోకల్ ప్రస్తావన మీద మండిపడుతున్న ప్రకాష్ రాజ్

Published on Jun 25, 2021 8:39 pm IST

త్వరలో జరగనున్న మా అధ్యక్ష ఎన్నికల హడావుడి ఇప్పుడే మొదలైపోయింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, జీవిత, నటి సుమ బరిలో ఉండగా మంచు విష్ణు కూడ పోటీకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరిలా ఉండగా ప్రకాష్ రాజ్ అందరికంటే ఒకడుగు ముందే ఉన్నారు. ఆయన తన ప్యానెల్ సభ్యుల జాబితాను కూడ ప్రకటించారు. వీరిలో జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయి కుమార్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, బండ్ల గణేష్ లాంటి ప్రముఖులు ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను ప్రస్తావించారు.

ముఖ్యంగా నాన్ లోకల్ ప్రసస్తావనను తీసుకొచ్చారు. ‘ఇది ఒక్కరోజులో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు.. ఏడాది కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. పరిశ్రమ ఎంతో సున్నితమైనది.. అందరూ అందరికి కావాల్సినవాళ్లే. మా అధ్యక్ష పదవికి పోటీ నిర్ణయం వెనుక చాలా ఆలోచన జరిగింది. గతంలో అధ్యక్షులుగా పనిచేసినవారు మా ప్యానల్‌లో నలుగురున్నారు. లోకల్, నాన్‌ లోకల్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అవార్డులు వచ్చినప్పుడు నాన్‌లోకల్ ప్రస్తావన రాలేదు, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్‌లోకల్ అనలేదు. కళాకారులు లోకల్ కాదు.. యూనివర్సల్’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

సంబంధిత సమాచారం :