తన ఫేవరైట్ డైరెక్టర్‌తో మళ్ళీ జతకట్టిన ప్రకాష్ రాజ్!

తన ఫేవరైట్ డైరెక్టర్‌తో మళ్ళీ జతకట్టిన ప్రకాష్ రాజ్!

Published on Jul 7, 2015 10:57 AM IST

Prakash-raj-priyadarshan
ఎలాంటి పాత్రనైనా తన విలక్షణ నటనతో రక్తికట్టించగల నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. తాజాగా ఆయన తనకెంతో ఇష్టమైన ‘కాంజీవరం’ లాంటి సినిమాను తనకు అందించిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి మరో సినిమా చేయనున్నారు. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో దర్శకుడిగా అద్భుతమైన పేరు సంపాదించుకున్న ప్రియదర్శన్, ప్రకాష్ రాజ్‌తో తాజాగా తెరకెక్కించబోయే సినిమా ఎయిడ్స్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది.

కాగా ఓ సీరియస్ అంశంగా కనిపించే నేపథ్యంలో నడిచే సినిమా అయినా ఈ సినిమాను ప్రియదర్శన్, తనకు బాగా అలవాటైన కామెడీ టచ్‌తో ఆలోచింపదగ్గ సినిమాగా తెరకెక్కించనున్నారట. దేశంలో ప్రఖ్యాతి గాంచిన టెక్నీషియన్స్ అయిన సంతోష్ శివన్, సబు శిరిల్‌లు ఈ సినిమాకు పనిచేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ సరసన ఈ సినిమాలో శ్రేయా రెడ్డి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ప్రియదర్శన్, ప్రకాష్ రాజ్ కలయికలో వచ్చిన ‘కాంజీవరం’ సినిమాకు గానూ ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు