‘మా’ ఎన్నికల బరిలోకి ప్రకాశ్‌ రాజ్‌ !

Published on Jun 21, 2021 12:00 am IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బరిలో దిగబోతున్నాను అని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు. మరి ప్రకాశ్‌ రాజ్‌ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. అయితే, ప్రకాష్ రాజ్ తానూ ఎందుకు మా ఎన్నికల్లో నిలబడుతున్నానో చెబుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది.

అయితే, ఆ సమస్యలను అధిగమించడానికి నా దగ్గర సరైన ప్రణాళిక కూడా ఉంది. అసలు ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే ‘మా’కు ఇప్పటివరకూ సొంత భవనం కూడా లేదు. ఒకవేళ నేను అధ్యక్షుడిని అయితే, 100 శాతం సొంత భవనం కూడా నిర్మిస్తాను అంటూ ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :