రామ్ చరణ్ కి తాతయ్యగా ప్రకాష్ రాజ్

Published on May 25, 2014 9:58 am IST

Ram-Charan's-Govindudu-Anda
ఇటీవలే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ని బాన్ చెయ్యాలని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ బాన్ ని కాన్సల్ చేసారు. ప్రస్తుతం ఈ విలక్షణ నటుడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ముందుగా ఈ పాత్ర కోసం తమిళ నటుడైన రాజ్ కిరణ్ ని అనుకున్నారు కానీ ఆయన కంటే ప్రకాష్ రాజ్ అయితే మంచి చాయిస్ అని చివరి నిమిషంలో ప్రకాష్ రాజ్ ని ఎన్నుకున్నట్లు ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముందు రామ్ చరణ్ కి తాతయ్య పాత్రలో రాజ్ కిరణ్ ని ఎంపిక చేసారు. దీన్ని బట్టి చూసుకుంటే ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ కి తాతయ్య పాత్రలో కనిపిస్తాడని ఆశించవచ్చు.

రామ్ చరణ్ కాస్త అనారోగ్యంగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త వాయిదా పడింది. కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :