‘డ్రాగన్’: ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్?

‘డ్రాగన్’: ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్?

Published on May 20, 2026 10:15 AM IST

NTRNeel

ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం ‘డ్రాగన్’ మేనియా పాన్ ఇండియా లెవెల్లో నడుస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అభిమానులని పాన్ ఇండియా ఆడియెన్స్ ని కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేసింది. అయితే ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ ఒకింత డిజప్పాయింట్మెంట్ కూడా ఇచ్చారా అంటే కొంచెం అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది.

ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ గత చిత్రాలు సలార్, కేజియఫ్ తరహాలో రెండేసి భాగాలుగా ఉంటాయి అని చాలామంది భావించారు. పైగా ఈ సినిమాలు ముందే భాగాలుగా ఉన్నాయా లేదా అనేది ముందే అనౌన్స్ చేసేసారు. కానీ డ్రాగన్ విషయంలో మాత్రం ముందే అలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఒకింత డిజప్పాయింటింగ్ అంశమే అని చెప్పాలి. సో ప్రస్తుతానికి డ్రాగన్ సినిమా ఒక్క భాగం గానే వస్తుంది అని చెప్పొచ్చు. మరి నేరుగా థియేటర్స్ లో పార్ట్ 2 లీడ్ ఏమన్నా చూపిస్తారేమో అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు