భయపడి కళ్ళు మూసుకున్న ‘కెజిఎఫ్’ డైరెక్టర్

Published on Jun 8, 2021 2:32 pm IST

ఈమధ్య కాలంలో దక్షిణాది ప్రేక్షకులు చూసిన బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ ఎవరు అంటే అనుమానం లేకుండా ప్రశాంత్ నీల్ పేరు చెప్పొచ్చు. ‘కెజిఎఫ్’ చిత్రంతో ఆయన సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అసలు సిసలు యాక్షన్ ఎంటర్టైనర్ అంటే ఎలా ఉంటుంది అనడానికి బెస్ట్ ఉదాహరణ ‘కెజిఎఫ్’. ఏ దర్శకుడైన సినిమాలో అక్కడక్కడా హీరోకి ఎలివేషన్స్ పెట్టుకుంటాడు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ‘కెజిఎఫ్’ చిత్రంలో తన హీరోకు ప్రతి సన్నివేశంలోనూ ఎలివేషన్ ఇచ్చాడు. అసలు ఈ స్థాయిలో హీరో పాత్రను పైకి లేపడం ఇంకెవరికైనా సాధ్యమేనా అనేలా పనితనం చూపాడు ప్రశాంత్ నీల్.

సినిమాల్లో తన హీరో చేత విధ్వంసం సృష్టించగల ప్రశాంత్ నీల్ కూడ భయపడ్డాడు. అది కూడ ఒక ఇంజెక్షన్ చూసి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ప్రశాంత్ నీల్ చిన్న పిల్లల తరహాలో చేతులు అడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు తన సినిమాల్లో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా వయొలెన్స్ సృష్టించే ప్రశాంత్ నీల్ ఇలా ఇంజెక్షన్ కు భయపడ్డాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అది కరోనా వ్యాక్సిన్ కాబట్టి తప్పక కళ్ళు మూసుకుని వేయించుకున్నాడు కానీ వేరే ఏదైనా ఇంజెక్షన్ అయ్యుంటే అసలు వేయించుకునేవాడే కాదేమో అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ చేసిన ‘కెజిఎఫ్-2’ విడుదల సన్నాహాల్లో ఉండగా ‘సలార్’ సెట్స్ మీద ఉంది.

సంబంధిత సమాచారం :