ఆ ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్ మాత్రమే..తమ భారీ చిత్రంపై ప్రశాంత్ నీల్.!

Published on May 20, 2021 1:02 pm IST

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా ఇతర ఇండస్ట్రీల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్స్ తో తారక్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబో నుంచి రానున్న అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్ల కితమే లైన్ లోకి వచ్చిన ఈ మాస్ కాంబో పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ ను సెట్ చేసి పెట్టింది.

కానీ మళ్ళీ గ్యాప్ రావాడం తర్వాత తారక్ నుంచే మళ్ళీ క్లారిటీ రావడంతో ఆ అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. మరి ఫైనల్ గా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రశాంత్ నీల్ నే చెప్పారు. రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుచుకుంటుంది అని తన ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చెయ్యడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని తారక్ ను ఉద్దేశించి చెప్తూ బర్త్ డే విషెష్ చెప్పారు.

అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారితో కలిపి సంయుక్తంగా నిర్మించనున్నట్టు తెలిపాడు. మొత్తానికి మాత్రం ఈ మోస్ట్ అవైటెడ్ కాంబో నుంచి ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :